కాంగ్రేస్ పార్టీ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం
ఫార్మ సీటీ పేరుతో రియాల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం
మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జాన్ 14(జనంసాక్షి):- కాంగ్రేస్ పార్టీ రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా యాచారం మండలం పరిధిలోని తక్కలపల్లి గ్రామంలో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇంచార్జి మల్ రెడ్డి రంగారెడ్డి అధ్వర్యంలో భారీ ర్యాలి నిర్వహించి రైతులు , మహిళలు కార్యకర్తలతో కలిసి రచ్చబండ కార్యక్రమంలో పాల్గోనడం జరిగింది.
ఈ సందర్బంగా మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ
యాచారం మండలంలో ఫార్మ సీటీ పేరుతో రైతుల భూములను గుంజుకొని టీఆర్‌ఎస్ పార్టీ భూ దందా కొనసాగిస్తోందని
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు
రైతు వ్యతిరేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పాలని
కెసిఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలు నలిగిపోతున్నారని అన్నారు
దళితులకు మూడెకరాలభూమి లేదు
నిరుద్యోగ భృతి లేదు
ఉచిత ఎరువులు లేవు రైతు రుణమాఫీ లేదు
రైతులకు పంట నష్ట పరిహారం లేదుధాన్యం కొనుగోలులో చిత్తశుద్ధి లేదు డబ్బా ఇండ్లు వద్దు డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తా అని పేద ప్రజలను మోసం చేసిండని
కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇచ్చేది లేదని ఉద్యమకారులకు స్వేచ్ఛ లేదు, గౌరవం లేదు.
కాంగ్రేస్ పార్టీ అధికారంలో రాగానే ఇట్టి భూ దందాలను అరికడతామని
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రేస్ పార్టీ వల్లనే సాధ్యం అని గుర్తు చేశారు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణమాఫీ.
ఇందిరమ్మ రైతు భరోసా- రైతులకు, కౌలుకు రైతులకు ప్రతి ఎకరాకు రూ.15 వేలు. ఉపాధి హామిలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు.
రైతుల పంటకు గిట్టుబాటు ధర, ప్రతి గింజను కొంటాం, ధరలు ముందే నిర్ణయం. మెరుగైన పంటల భీమాను తీసుకోస్తాం, రైతు కూలీలకు, భూమిలేని రైతులకు భీమా. ఉపాధి హామీ పథకానికి వ్యవసాయాన్ని అనుబంధం చేస్తాం అని అన్నారు
పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు యాజమాన్య హక్కు.కల్పిస్తామని అన్నారు
ధరణి పోర్టలును రద్దు చేసి మెరుగైన రెవెన్యూ వ్యవస్థను తీసుకోస్తామని అన్నారు
నకిలీ పురుగు మందులు అమ్మితే కఠిన చర్యలు.. అమ్మే సంస్థలపై పీడి యాక్టు. పెడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు
పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తామని చివరి ఎకరా వరకు నీళ్లు అందిస్తామని అన్నారు
రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్టపర అధికారాలతో రైతు కమీషన్.ఏర్పాటు చేస్తామని అన్నారు
వ్యవసాయాన్ని పండగ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని అన్నారు వివిధ పార్టీలకు చెందిన 30 మంది నాయకులు కాంగ్రెస్ లో చేరడం జరిగింది పార్టీలో చేరిన వారిలో తెరాస నాయకులు చంద్ర శేఖర్ రెడ్డి,కోరే సంతోష జగదీష్ రావు,బీజేపీ మహిపాల్ రెడ్డి, యాదయ్య, వెంకటేష్,జంగారెడ్డి, బాలయ్య,పార్టీలో చేరారు ఈ
కార్యక్రమములో వైస్ ఎంపిపి శ్రీనివాస్ రెడ్డి,యాచారం మండల అధ్యక్షుడు మస్కు నర్సింహా మండల ప్రధాన కార్యదర్శులు గదల మల్లేష్, వరికుప్పల సుధాకర్ ,మాజీ ఎంపిపి జ్యోతి శ్రీనివాస్ నాయక్,ఎంపీటీసీ లు లక్ష్మీపతి గౌడ్ , కొర్ర జ్యోతి అరవింద్ నాయక్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గౌరారం వెంకట్ రెడ్డి ఉపాధ్యక్షుడు అఖిల్ ఖాన్,గ్రామ శాఖ అధ్యక్షుడు మద్దెల వెంకటేష్, మాజి ఎంపిటిసి గదల మాధవి నాయకులు తోకల శ్రీనివాస్,కృష్ణ, కిష్టారెడ్డి, నరేందర్ రెడ్డి,మలికార్జున రెడ్డి,వెంకట్ రెడ్డి, ప్రేమేష్,రామాచారి,సంజీవ,సత్తయ్ య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు