కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి
టేకులపల్లి, ఆగస్టు 24 (జనం సాక్షి ): నేషనల్ హెల్త్ మిషన్ లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో గత 22 సంవత్సరాల నుండి పని చేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ గురువారం నుండి నల్ల రిబ్బన్ బ్యాడ్జీలతో నిరసనను వ్యక్తం చేశారు. తమ సేవలను గుర్తించి ప్రభుత్వం ఏళ్ల తరబడిగా చాలీచాలని జీతాలతో నిర్వహిస్తున్నందున ప్రభుత్వం గుర్తించి వెంటనే రెగ్యులర్ చేయాలని స్టాఫ్ నర్సులు, వైద్య సిబ్బంది, కాంటిజంటల్ వర్కర్స్ కోరారు. లేనిపక్షంలో ఈ నెల 31 వ తారీకు నుండి నిరవధిక సమ్మెలో పాల్గొంటామని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు సునీత,కళమ్మ,కాంటిజెంటల్ పనివాళ్ళు పద్మ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.