కాంతనపల్లి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలి
నరసంపేట: రాష్ట్రబడ్జెట్‌లో కాంతనపల్లి ప్రాజెక్టుకు రూ. 1000 కోట్ల కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెదేపా , సీపీఎం రాస్తారోకో చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ ఆందోళన వల్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నరసంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.