సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ నిరసనలు

వరంగల్‌ : కాకతీయ ఉత్సవాలను ప్రారంభించడానికి వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి , కేంద్ర మంత్రి చిరంజీవికి ఉత్సవ వేదికపై కూడా తెలంగాణ నిరసనలు స్వాగతం పలికాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ వేదికపై బైఠాయించి సీఎం ప్రసంగిస్తుండగా జై తెలంగాణ నినాదాలతో అడ్డుకున్నారు. ఆయన వేదికపై కింద కూర్చుని సీఎం ప్రసంగానికి అడ్డు తగిలారు. కొద్ది సేపటికి ఎమ్మెల్యే వేదిక దిగి వెళ్లిపోయారు.
పేలవంగా సీఎం ప్రారంభోపన్యాసాన్ని పేలవంగా ముగించారు. తెలంగాణ వాదులు జై తెలంగాణ నినాదాలు చేస్తూ సీఎం ప్రసంగానికి అడ్డతగలడంతో ఆయన ఐదు నిమిషాలలోనే తన ప్రసంగాన్ని పూర్తి కానిచ్చారు.
చిరంజీవికి తెలంగాణ సెగ
కాకతీయ ఉత్సవాల్లో ప్రసంగిస్తుండగా కేంద్ర మంత్రి చిరంజీవికి తెలంగాణ సెగ తగిలింది. వేదికపై నుంచి ఆయన ప్రసంగించడం ప్రారంభించగానే సభా ప్రాంగణం పెద్ద ఎత్తున జై తెలంగాణ నినాదాలతో మారుమోగింది. తెలంగాణపై  మంత్రి స్పష్టమైన వైఖరి చెప్పాలంటూ తెలంగాణ వాదులు డిమాండ్‌ చేశారు. కుర్చీలు పైకి ఎగురవేస్తూ నిరసనలు మిన్నటించారు. దీంతో మంత్రి అతి త్వరగా తమ ప్రారంభోపన్యాసాన్ని విరిమించారు.