కాకతీయ గనిలో సినీసందడి..!
ఆసక్తిగా తిలకించిన జనం….
భూపాలపల్లి, జూన్ 17, (జనంసాక్షి) :
భూపాలపల్లి ఏరియాలోని కెటికె 2వగనిలో సినిమా షూటింగ్‌ను ఆదివారం జరిగింది. నూతన తారలతో ఫైట్‌సీన్‌ను చిత్రీకరించారు. షూటింగ్ జరుతున్నదని తెలుసుకున్న స్థానికులు గని వద్దకు చేరుకున్నారు. సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ దృష్యాన్ని అందరు ఆసక్తిగా తిలకించారు. కింగ్‌ఆఫ్‌కింగ్స్‌ఫిలిమ్స్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సినిమా డైరెక్టర్ రిషిజాన్‌క్రిస్ట్ తెలిపారు. ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదన్కారు. స్పెషల్‌సాంగ్, చేజింగ్‌సీన్ తీయడానికి ఇక్కడికి వచ్చినట్లు పేర్కొన్నారు. చిత్రంలో హీరోగా దినాకర్‌బాబు, హీరోయిన్‌గా అగ్నోసోంకర్ నటిస్తున్నట్లు చెప్పారు. ఫైట్ సీన్‌ను మాస్టర్ కుమార్ ఆధ్వర్యంలో చిత్రికరించారు., ఇందులో స్ట్రీట్‌బాయ్స్‌గా భూపాలపల్లికి చెందిన పిల్లలు, సానా డ్యాన్స్‌అకాడమి డ్యాన్స్‌మాస్టర్ సుధాకర్ నేతృత్వంలో నటించారు. మొదటిసారిగా భూపాలపల్లి ఏరియాలో సినిమా షూటింగ్ జరగడంతో స్థానికులు చూడటానికి ఎగబడ్డారు.