కాగజ్‌నగర్‌లో పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో
ఆదిలాబాద్: కాగజ్‌నగర్‌లోని పాఠశాలలను డీఈవో తనిఖీ చేశారు. బట్టుపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుని పాత్ర పోషించారు. విద్యార్థులకు పాఠాలు బోదించారు. అనంతరం వారిని ప్రశ్నలడిగి వారిచ్చిన సమాధానాలకు సంత్రృప్తి చెందారు. మధ్యహ్న భోజన పథకాన్ని పరిశీలించి ఏజెన్సీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌటాల, ముత్యంపేట పాఠశాలలను తనిఖీ చేశారు.