కాటేదాన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి: నగర శివారు రాజేంద్రనగర్‌లో కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శోభ ప్లాస్టిక్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని భారీగా వ్యాపించాయి. రసాయనాలతో కూడిన పొగతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.