కాబూల్‌లో మళ్లీ వరుస పేలుళ్లు

కాబూల్‌, మే9(జ‌నం సాక్షి): వరుస పేలుళ్లతో అప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ మరోసారి దద్దరిల్లింది. వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం మూడు బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పోలీసులు, ¬ంమంత్రిత్వశాఖ అధికారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆత్మాహుతి దాడులు జరిగాయి. పేలుళ్లతో పాటు కాల్పులు కూడా చోటుచేసుకున్నట్లు స్థానిక విూడియా వెల్లడించింది. కాబూల్‌లోని విదేశీ రాయబార కార్యాలయాలు, ప్రభుత్వ ఆఫీసులకు సవిూపంలోని ఓ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట తొలుత ఆత్మాహుతి దాడి జరిగింది. ఓ వ్యక్తి స్టేషన్‌ ముందుకు వచ్చి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఇది జరిగిన కొద్ది సేపటికే మరో ప్రాంతంలోనూ రెండు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానిక విూడియా పేర్కొంది. కాల్పులు కూడా చోటుచేసుకున్నట్లు తెలిపింది. అప్రమత్తమైన పోలీసులు, భద్రతాసిబ్బంది వెంటనే ఘటనాస్థలంలో సహాయకచర్యలు చేపట్టారు. కాగా.. ఈ దాడుల్లో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల, క్షతగాత్రుల సంఖ్య ఇంకా తెలియరాలేదు. గతవారం కూడా కాబూల్‌లో వరుస పేలుళ్లు జరిగి 25 మంది 
ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వీరిలో 9 మంది పాత్రికేయులు కూడా ఉన్నారు. తాజా దాడికి సంబంధించి ఇంతవరకూ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.