కార్డెన్ సెర్చ్‌లో వాహనాలు స్వాధీనం
కరీంనగర్,సెప్టెంబర్26(జనంసాక్షి): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలకేంద్రంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అడిషనల్ డీసీపీ సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు రామకృష్ణ కాలనీలో తనిఖీలు చేశారు. సరైన ధృవ పత్రాలు లేని 43 బైకులు, రెండు ఆటోలతో పాటు నిషేధిత గుట్కా
ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గుట్కాలు అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేశారు. తర్వాత గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పనితీరును పరిశీలించారు. శాంతిభద్రతల కోసమే ఈ సెర్చ్ నిర్వహించామని అడిషనల్ డిసీపీ సంజీవ్ కుమార్ తెలిపారు. అపరిచితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.