కార్తీక మాసంలో అన్నదానం ఎంతో విశేషమైంది

ర్తీక మాసంలో అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో విశేషమైందని వేదాంత భజన మందిర ప్రాంగణంలోని అన్నదాన నిర్వాహకులు వాడకట్టు ఆంజనేయులు , బ్రహ్మండ్లపల్లి సంతోష్, దేవిదత్తు అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజారులోని వేదాంత భజన మందిర ప్రాంగణంలో అన్ని మాలాధారణ స్వాములకు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.ప్రతి మంగళవారం రాముల వారి సన్నిధిలో అన్ని మాలాధారణ స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అన్ని మాలాధారణ స్వాములు ఈ అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో భజన మందిరం అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి నకరికంటి రాజశేఖర్ , కోశాధికారి సోమా అశోక్ , మందిర ప్రధానార్చకులు ధరూరి సింగరాచార్యులు, అర్చకులు రాఘవాచార్యులు, సోమా సుమన్, కొత్తూరు రాజు, ధనుంజయ రవికుమార్, చంద్ర శేఖర్, బోనగిరి లక్ష్మయ్య, గోపి, షీలా శంకర్,సంపత్, శ్రీనివాస్ , విజయ్, సందీప్, శ్రీధర్, వెంకటేశ్వర్లు, కృష్ణ, రాము, ప్రేమలత, హైమావతి, స్వాతి, పద్మ, రూప, బచ్చు పురుషోత్తం  తదితరులు పాల్గొన్నారు