కార్తీక వనభోజనాలు విజయవంతం చేద్దాం..

 

– మున్నూరు కాపుల ఐక్యతను చాటుదాం

– వరంగల్ తూర్పు మున్నూరు కాపు కోఆర్డినేటర్ పోతు కుమారస్వామి

-వరంగల్ ఈస్ట్, నవంబర్ 17(జనం సాక్షి)

 

ఈనెల 20న ఆదివారం వరంగల్ తూర్పు నియోజకవర్గం మున్నూరు కాపుల కార్తీక వనభోజనాలు విజయవంతం చేద్దామని వరంగల్ తూర్పు మున్నూరు కాపు కోఆర్డినేటర్ పోతు కుమారస్వామి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం జన్మభూమి జంక్షన్ వద్ద గల మున్నూరు కాపు భవనంలో సమావేశం నిర్వహించారు. వనభోజనాలకు సంబంధించిన బ్రోచర్స్ను ఆవిష్కరించారు. సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 24 డివిజన్లో మున్నూరు కాపులు కార్తీక వనభోజనాలను వైభవంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నారు. దోపగుంట రోడ్డులోని మై మాస్టర్ స్కూల్ వద్ద గల మామిడి తోటలో ఈ నెల 20న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు వనభోజనాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాలకు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తో పాటు వివిధ రాజకీయ నేతలు వ్యాపార వర్గాలు ఉద్యోగులు మేధావులు హాజరవుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కళాకారులు పెద్దింటి మధుప్రియ పటేల్ ,మామిడి మౌనిక పటేల్ తో పాటు మరికొందరు హాజరవుతున్నట్లు తెలిపారు. మున్నూరు కాపులంతా ఐక్యతతో ఈ వనభోజనాలను విజయవంతం చేసి మన సత్తా చాటాలని కుమారస్వామి కోరారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు పెద్దలు పెంచాల గోపన్న, కేడల జనార్ధన్, సిద్ధం రాజు, సోమిశెట్టి ప్రవీణ్, ముష్కమల్ల సుధాకర్, ఓగిలి శెట్టి అనిల్ ,మేడిది మధుసూదన్, బోరిగం నర్సింగం, సింగరి రాజ్ కుమార్, కుందారపు రాజేందర్, మర్రి రవి, మీరు పెళ్లి రాజు, వినయ్ ,పిన్నా మల్లేశం, తోట రవి, సాంబరాజు వెంకటేశ్వర్లు, కొమ్మిని రాజేందర్, మురళీకృష్ణ, బండి చక్రపాణి,  శివ ,వాసు, మనోహర్, బండి జనార్ధన్, దూరం ఆనంద్, బోరిగం నాగరాజు తదితరులు పాల్గొన్నారు