కార్పొరేటర్ యుగంధర్ రెడ్డికి మంత్రి ఆశీస్సులు

మేడిపల్లి – జనంసాక్షి
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ మద్ధి యుగంధర్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీశైల మల్లికార్జున స్వామి లడ్డు ప్రసాదాలు అందజేసి   మంత్రి ఆశీర్వాదాలు తీసుకొన్నారు. యుగంధర్ రెడ్డి మరింత ఉన్నత శిఖరాలు అందుకోవాలని, ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు నిర్వహించుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అశోక్ రెడ్డి పాల్గొన్నారు.
Attachments area