కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారు

` 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయింపు
` మున్సిపల్‌ ఎన్నికల్లో కీలక ముందడుగు
` రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
` ఎన్నికల సంఘానికి అందనున్న జాబితా
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల పక్రియలో కీలక ముందడుగు పడిరది. 10 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. శనివారం సాయంత్రానికి మున్సిపల్‌ వార్డులు, కార్పొరేషన్‌ డివిజన్ల రిజర్వేషన్ల పక్రియ పూర్తి కానుంది. రాత్రికి లేదాఆదివారం ఉదయానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల జాబితా అందజేసే అవకాశం ఉంది. ప్రభుత్వం జీవో ఇచ్చిన వెంటనే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసేందుకు ఎస్‌ఈసీ సిద్ధంగా ఉంది. ఒకటి, రెండు రోజుల్లోనే మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. 10 కార్పొరేషన్లలో ఎస్సీ`1, ఎస్టీ`1, బీసీ`3(ఒకటి మహిళ)లకు కేటాయించారు. జనరల్‌ కేటగిరీలో ఐదు స్థానాలకు గానూ ఏకంగా నాలుగు స్థానాలను మహిళలకు కేటాయించారు. 121 మున్సిపాలిటీల్లో ఎస్సీ`17, ఎస్టీ`5, బీసీ`38, జనరల్‌`61 కేటాయించడం జరిగింది.కార్పొరేషన్ల వారీగా రిజర్వేషన్లు… ఇలా ఉన్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్‌ ` ఎస్టీ (జనరల్‌),రామగుండం కార్పొరేషన్‌` ఎస్సీ (జనరల్‌),మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌` బీసీ మహిళ, మంచిర్యాల కార్పొరేషన్‌` బీసీ (జనరల్‌), కరీంనగర్‌ కార్పొరేషన్‌ ` బీసీ (జనరల్‌), ఖమ్మం కార్పొరేషన్‌` మహిళ (జనరల్‌), నిజామాబాద్‌ కార్పొరేషన్‌` మహిళ (జనరల్‌), వరంగల్‌ కార్పొరేషన్‌` జనరల్‌, జీహెచ్‌ఎంసీ ` మహిళ (జనరల్‌) నల్లగొండ కార్పొరేషన్‌` మహిళ (జనరల్‌) కు కేటాయించారు.