కార్పోరేటు పాఠశాలలకు ధీటుగా గురుకులాలు.. ప్రభుత్వ విఫ్

 

-గురుకులాలను ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న ఘనత కెసిఅర్ దె

-విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడం ఆనందంగా వుంది : ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్…

 

నాణ్యమైన విధ్య,బోజనం అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే…

హన్మకొండ బ్యూరో చీఫ్ 17 అక్టోబర్ జనం సాక్షి

గిరిజన గురుకుల (బాలికల) జూనియర్ కళాశాలలో జరిగిన 6 వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్-2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాలను స్థాపించి అత్యంత నాణ్యత ప్రమాణాలతో కూడా విద్యను మీకు అందిస్తుందన్నారు.గురుకులాల విద్యార్థులు ఉన్నతంగా రాణిస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు.రాబోయే రోజుల్లో సాంకేతికను అందిపుచ్చుకుని ప్రపంచంతో పోటీ పడాలన్నారు.గురుకులాలను స్థాపించి కొన్ని లక్షల మందికి నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ,ఒక్కోక్క విధ్యార్ధి పై 1 లక్ష 20 వేల రుాపాయలను ఖర్చుపెట్టి,కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా గురుకులాల్లో ఐఐటీ, జేఈఈ నీట్ వంటి పోటీ పరీక్షల కోసం విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.విద్యార్థులు కుడా తమ ప్రతిభను కనబరిచి ఉత్తమ ర్యాంకులు సాధించడం ఆనందంగా వుందాన్నారు.అంతేకాకుండా జాతీయ క్రీడల్లో సైతం గురుకులాల్లో చదివే విద్యార్థులు తమ సత్తాను చాటుతూ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి లలో పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచి, పలు అవార్డులను సైతం పొందడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.క్రీడలను ప్రోత్సహించడానికే అనేక నిధులు వెచ్చించి క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందన్నారు.ఈ కార్యక్రమంలో గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్,హనుమకొండ జిల్లా కలెక్టరు రాజీవ్‌గాంధీ హనుమంతు, ఐటిడీఏ పాలనాధికారి అంకిత్ కుమార్, తెలంగాణ రాష్ట్ర రైతు ఋణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు ,గురుకులాల రీజనల్ కో ఆర్డినేటర్ మరియు పాఠశాల ప్రిన్సిపాల్, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.