కార్పోరేట్ వ్యవసాయం రైతుల్ని కూలీలుగా మారుస్తోంది. -రాఘవులు
గాంధీచౌక్(ఖమ్మం): కార్పొరేట్ వ్యవసాయం రైతుల్ని కూలీలుగా మారుస్తోందని దీన్ని తమపార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండో హరిత విప్లవం పేరుతో చేపట్టే కార్పొరేట్ వ్యవసాయంతో రైతు ఆత్మహత్యలు మరింతగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి శైలజనాధ్‌పై ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయశాఖమంత్రి అశ్వనీకుమార్‌కు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. అ సమావేశంలో సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ రావు నాయకులు నున్నా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.