కార్మికులకు 11వ పిఆర్సి ని అమలు చేయాలి.

– ప్రతి ఆదివారం సెలవులు ప్రకటించాలి.
– 8గంటల పని విదనాన్ని అమలు చేయాలి.
– రాష్ట్ర రెండో మహాసభలు జయప్రదం చేయాలి.
– సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు.
ఊరుకొండ, అక్టోబర్ 16 (జనంసాక్షి):
గ్రామపంచాయతీ కార్మికులకు 11వ పి.ఆర్.సిని అమలు చేయాలని.. జీవో నెంబర్ 51 సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జీ.ఆంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఊరుకొండ మండల పరిధిలోని ఊరుకొండ పేట ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జి.ఆంజనేయులు అధ్యక్షతన ఏర్పాటుచేసిన తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు అనుబంధం) మండల కమిటీ సమావేశంలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికులకు 8గంటల పని విదనాన్ని పటిష్టంగా అమలు చేయాలనీ.. గ్రామపంచాయతీ సిబ్బందికి, కార్మికులకు ప్రతి ఆదివారం సెలవులు ప్రకటించాలనీ ఆయన డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు, వైద్య ఖర్చులు, ఇతర ఆర్థిక భారాలను దృష్టిలో పెట్టుకొని వచ్చేనెల 19, 20 తేదీలలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర రెండవ మహాసభలకు జిల్లాలోని అన్ని మండలాల నుండీ గ్రామాలు నుండి గ్రామపంచాయతీ సిబ్బంది, కార్మికులు, కర్షకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ మహాసభలను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అబ్రహం, జంగయ్య, తిరుపతమ్మ, వెంకటమ్మ, వల్లమ్మ, బాల్ చిన్నమ్మ, తదితరులు పాల్గొన్నారు.