కార్మికులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలి
డబ్బికార్ మల్లేష్
మిర్యాలగూడ. జనం సాక్షి.
కార్మికులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని సిఐటియు జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేష్ కోరారు. ఆదివారం రైస్ మిల్ డైవర్స్ యూనియన్ 13వ మహాసభ స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. కార్మిక చట్టాన్ని తూట్లు పొడిచేందుకు నూతన కోడ్లు తీసుకొచ్చిందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఉద్యమాలతో తీపి కొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు గౌరవాధ్యక్షులుగా తిరుపతి రామ్మూర్తి అధ్యక్షులుగా కే సుధాకర్ ప్రధాన కార్యదర్శిగా బి వెంకన్న కోశాధికారిగా వెంకటేశ్వరరావు తోపాటు 12 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.