కార్యకర్తలకు అండగా టిఆర్ఎస్ పార్టీ

చౌడాపూర్ అక్టోబర్ 23( జనం సాక్షి): చౌడాపూర్ మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త బ్యాగరి చంద్రయ్య అకాల మరణం చెందడం జరిగింది.చంద్రయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు రూపాయలు వారి కుటుంబానికి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి శంకర్,ఉపసర్పంచ్ శివకుమార్,రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు యాదయ్య,టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు రాజయ్య,లక్ష్మయ్య,పుట్ట యాదయ్య,వార్డు మెంబర్ అశోక్ ,కృష్ణయ్య,రమేష్,రాజు,శ్రీను మరియు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.