కార్యకర్తలు.. నా కుటుంబసభ్యులు
– ఎమ్మెల్యే రెడ్యానాయక్
డోర్నకల్ ఆగస్టు 20 జనం సాక్షి
గత 4 దశాబ్దాలుగా ప్రజా సేవే శ్వాసగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే రెడ్యా నాయక్ 70వ జన్మదినం పురస్కరించుకొని శనివారం డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలో టిఆర్ఎస్ శ్రేణులు టపాసులు కాల్చి,కేకులు కోసి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం పట్టణ,మండల నుంచి భారీ సంఖ్యలో టిఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే రెడ్యానాయక్ స్వగృహం ఉగ్గంపల్లి చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు తన కుటుంబసభ్యులతో సమానమని ఆయన పేర్కొన్నారు.జీవితంలో కొన్ని మధురానుభూతులు ఎప్పటికీ మరిచిపోలేమని,డోర్నకల్ లో మీరు చూపించే ఆప్యాయత కూడా అలాంటిదేనన్నారు.పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్ ఏర్పాటు చేసిన భారీ కేకును ఎమ్మెల్యే రెడ్యా నాయక్ సతీమణి లక్ష్మితో కలిసి కేకును కోసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్పిటిసి కమల రామనాథం,ఎంపీపీ బాలు నాయక్,చైర్మన్ వాంకుడోత్ వీరన్న,వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం,సొసైటీ అధ్యక్షులు బిక్షంరెడ్డి,సొసైటీ ఉపాధ్యక్షులు ఎలమద్ది మన్మధరావు,కౌన్సిలర్లు పోటు జనార్ధన్,సురేందర్,శరత్,సంధ్యా రాణి రమేష్, అశోక్,మౌనిక యశోదర్,కొత్త రాధిక వీరన్న,అరుణ మధు,ఫర్విన్ సుల్తానా సలీం, నాయకులు ఇంజమ్ కృష్ణయ్య,పోకల శేఖర్,మాతంగి అనిల్,సర్పంచులు బోస్ వెంకన్న,ఆంగోత్ మోహన్,పగడాల అంజయ్య,వరలక్ష్మి నాగేశ్వరరావు,తేజవత్ గమ్మి రాజు నాయక్,దేవి శంకర్,గుగులోతు శ్రీను నాయక్,చేరెడ్డి సమ్మిరెడ్డి,ఎంపీటీసీలు ఆంగోత్ నీల రమేష్,కోటి శంకర్,శ్రీను,మండల యూత్ అధ్యక్షులు ఆంగోత్ హరీష్ నాయక్,పట్టణ యూత్ అధ్యక్షులు వెంకటేష్,మైనార్టీ సెల్ అధ్యక్షులు గౌస్ పాషా,ఎస్టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి ఆంగోత్ లచ్చు నాయక్,మండల కో ఆప్షన్ ఎస్కే లాలు మియా,కొత్త వీరన్న,గణేష్,రహీం,రాయల వెంకటేశ్వర్లు,కడెం బాబు,కడెం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.




