కార్యకర్తలు నిరంతరంగా శ్రమించాలి

అభివృద్ది పథకాలను ప్రజలకు వివరించాలి: కొప్పుల

ధర్మపురి,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మాజీ చీఫ్‌విప్‌, ధర్మపురి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ సూచించారు. ఆయా గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయని, వాటిపై ప్ర జలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే భవిష్యత్‌లో గ్రామాల్లో ప్రణాళికబద్ధంగా చేపట్టేబోయే అభివృద్ధి పనులపై వివరించాలన్నారు. నాయకు లు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు.వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వందకుపైగా సీట్లు సాధించడం ఖాయమని, ఫలితాలు చూసిన రోజున ప్రతిపక్ష పార్టీల గూబ

గుయ్యిమనడం ఖాయమని తాజా అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఇతర పథకాలను చూసి యావత్‌ దేశమే ఆశ్చర్యపోయిందన్నారు. తెలంగాణ ప్రజలు 20 ఏళ్లపాటు టీఆర్‌ఎస్‌ పాలనను కోరుకుంటున్నారని, ప్రతి సర్వే పార్టీ విజయాన్ని సూచిస్తున్నదని చెప్పారు.

ధర్మపురి నియోజకవర్గంలో నాలుగేళ్ల లో రూ.1100 కోట్లతో అభివృద్ధి చేసిన ట్లు వివరించారు. అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటే ప్రతిపక్షాలకు కనిపించకపోవడం బాధాకరమని, వారికి కంటి వెలుగు శిబిరాల్లో పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీల దుష్పచ్రారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు.