కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది!
*ఎమ్మెల్యే సురేందర్
_________________________
లింగంపేట్ 09 అక్టోబర్ (జనంసాక్షి)
కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు.ఆయన ఆదివారం లింగంపేట్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల కుటుంబాలకు ఆరు లక్షల రూపాయల చెక్కులను అందజేసారు.టిఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకొని మృతి చెందిన కార్యకర్తలు మండలంలోని అయ్యావల్లి గ్రామానికి చెందిన బొడ్డు రాములు, సూరాయిపల్లి గ్రామానికి చెందిన వెల్పుల సంగవ్వ భర్త,పరుమల్ల గ్రామానికి చెందిన కొండబోయి సాయిలు భార్య మృతి చెందడంతో వారి కుటింబికులకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఇన్స్ రెన్స్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దివిటి రమేష్,ఏంసి వైస్ చైర్మన్ గజవాడ నరహరి,లింగంపేట్ సింగిల్విండో చైర్మన్ దేవెందర్ రెడ్డి,బీఆర్ఎస్ పార్టీ నాయకులు నయీం,మండల ప్రధాన కార్యదర్శి అట్టెం శ్రీనివాస్,మండల యూత్ అధ్యక్షుడు సుప్పాల నరేష్,బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area