*కాలమై కరువు పడ్డట్లుగా ఉంది రైతు గోస!

*పోల్కంపేట్ లో దంచి కొట్టిన వాన
*రైతులు పండిచిన వరిధాన్యం నేల పాలు!
_________________________
లింగంపేట్ 14 అక్టోబర్ (జనంసాక్షి)
కాలమై కరువు పడ్డట్టుగా రైతుల గోస ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం నుండి రైతులు వరినాటు మొదలు వరి కోసే వరకు వానలు వదలక పోవడంతో రైతులు పండించిన పంట నేలపాలు అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.లింగంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో పొల్కంపేట్  గ్రామంలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి వందల మంది రైతుల వరి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు లబో దిబో మంటున్నారు.పోల్కంపేట్ గ్రామంలో 100 మంది రైతుల వరి ధాన్యం తడిసి ముద్దయిందని రైతులు తెలిపారు.