కాళేశ్వరం పేరుతో కోట్లు దండుకున్నారు

మైదానప్రాంతంలో ప్రాజెక్ట్‌ ఎవరైనా కడతారా
కమిషన్ల కక్కుర్తితోనే ప్రజాధనం వృధా
మండిపడ్డ మాజీ ఇరిగేషన్‌ మంత్రి పొన్నాల

హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): మైదాన ప్రాంతంలో ప్రాజెక్టు కట్టిన చరిత్ర కెసిఆర్‌దే అని మాజీమంత్రి
పీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ఎవరైనా మైదాన ప్రాంతంలో ప్రాజెక్టులు కడతారా అని ప్రశ్నించారు. ఇదేనా నీ ఇంజనీరింగ్‌ అంటూ మండిపడ్డారు. అన్నారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ… కేసీఆర్‌ను కొంగముక్కు అంటూ సెటైర్‌ వేశారు. అనుభవరాహిత్యం, అహంకారం తోడైన వ్యక్తి కేసీఆర్‌ అని మండిపడ్డారు. ప్రాజెక్టులు కల్వకుంట్ల కుటుంబానికి కవిూషన్ల పండిరచిందని
విమర్శించారు. కాళేశ్వరం నీళ్లతో ప్రయోజనం ఉందా నిరుపిస్తారా అని కేసీఆర్‌కు పొన్నాల ఛాలెంజ్‌ విసిరారు. చరిత్రలో నిరుపయోగమైన ప్రాజెక్టు కట్టిన చరిత్ర కేసీఆర్‌ దే అంటూ యెద్దేవా చేశారు.
ఇతర రాష్టాల్ర ప్రయోజనం కోసం లోపాయికారీ ఒప్పందతోనే కేసీఆర్‌ ప్రాజెక్టులు కట్టారన్నారు.
మల్లన్నసాగర్‌లో 50 టీఎంసీలు నింపే దమ్ము కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. డిజైన్‌ లోపం బయటపడుతుందనే ప్రాజెక్టుల దగ్గరికి ఎవర్నీ పోనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల దగ్గర తామేమైనా బాంబులు పెడుతామా అంటూ నిలదీశారు. ఎవర్నీ అడిగి కేసీఆర్‌ ప్రాజెక్టులు కడుతున్నారన్నారు. తెలంగాణలో నీళ్ళ కోసం పోరాటం చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ ప్రాజెక్టులకు, టీఆర్‌ఎస్‌ ప్రాజెక్టులకు తేడా ఎంత ఉందో చూడాలని పొన్నల లక్ష్మయ్య పేర్కొన్నారు. తన ప్రాణం ప్రాణహితలోనే ఉందని అన్నారు. తుమ్మడిహట్టు వద్ద డిజైన్‌ చేస్తే దానినిమార్చి ఇష్టం వచ్చినట్లుగా కాళేశ్వరం కట్టారని అన్నారు.