కాశీంనగర్ కు సాగునీళ్లు తీసుకువస్తా

 

రామన్నగట్టు వద్ద రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుండి కాశీంనగర్ కు సాగునీళ్లు తీసుకువస్తాం

వనపర్తి నియోజకవర్గంలోని 211 గ్రామాలు 135 గ్రామపంచాయతీలలో ఒక్క కాశీంనగర్ మాత్రమే సాగు నీరు రాలేదు

మోటార్లు ఏర్పాటు చేసి గతంలో కొన్ని నీళ్లు తీసుకువచ్చాను .. కానీ అవి సరిపోవు

2005కు పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పట్టాలు అందిస్తాం

మూడు తరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులకు పట్టాలు అందిస్తాం

పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమం .. ప్రతి ఊరికి అభివృద్ధి

సొంత ఇంటి స్థలం ఉన్న అర్హులకు డబల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వ సాయం .. విడతల వారీగా పేదలకు సాయం

పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాల అమలు

ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి పైరవీలు, అవినీతికి తావులేకుండా పారదర్శకతతో అమలు

అర్హులయిన వారందరికీ ఆసరా ఫించన్లు

కాశీంనగర్ పరిధిలో 561 మంది రైతులకు ఇప్పటి వరకు రూ.3.1 కోట్లు రైతుబంధు నిధులు

కాశీంనగర్ పంచాయతీకి నెలకు రూ.లక్ష 20 వేలు

గ్రామపంచాయతీ కరంటు బిల్లు, ట్రాక్టర్ ఖర్చులు, గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు, ఇతర అభివృద్ధి పనులకు మనిషికి రూ.1650 చొప్పున ప్రభుత్వ నిధులు

వనపర్తి మండలం కాశీం నగర్, కంద్రియా తండా, నాగమ్మ తండాలకు చెందిన నూతన ఆసరా ఫించను లబ్దిదారులకు గుర్తింపు కార్డులు, బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి