కాశ్మీర్‌లో కొనసాగతున్న అల్లర్లు

3

– ఒకరి మృతి

– 72కు చేరిన మృతుల సంఖ్య

శ్రీనగర్‌,ఆగస్టు 31(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌ లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. సోమవారం కర్ఫ్యూను తొలగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. మళ్లీ హింస చెలరేగింది. బారాముల్లా జిల్లాలో ఆందోళనకారులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన తాజా ఘర్షణలో 18 ఏళ్ల దనిష్‌ అహ్మద్‌ మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆందోళన కారులు నదిహల్‌ గ్రామం వద్ద భద్రతా బలగాలపై పెద్ద ఎత్తున రాళ్లదాడి చేశారు. దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అహ్మద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కశ్మీర్‌ అల్లర్ల మృతుల సంఖ్య 72 కు చేరుకుంది. అహ్మద్‌ మరణంతో మరోసారి ఉధ్రిక్త పరిస్థితులు నెలకొనడంతో బారాముల్లా, సోపోర్‌ లలో మరోసారి భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.