కాశ్మీర్‌లో కొనసాగుతున్న సమ్మె
శ్రీనగర్:జమ్మూకాశ్మీర్ ఐదో రోజూ సమ్మె కొనసాగుతుంది.200 ఏళ్ల నాటి దస్తగిర్ దర్గా అగ్నిప్రమాదం నేపధ్యంలో గ్రాడ్ ముఫ్తీ సమ్మెకు పిలుపునిచ్చింది.ఐదు రోజులుగా సమ్మె కొనసాగుతుండడంతో కాశ్మీర్‌లోయలోని ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.సమ్మె కారణంగా పాఠశాలలు,కళాశాలలు,దుకాణాలు కార్యాలయాలను మూసివేశారు.శుక్రవారం ప్రమాదం జరిగిన దర్గాకు ర్యాలీగా వెళ్లాలని గ్రాండ్ ముఫ్తీ పిలుపు ఇచ్చిన నేపధ్యంలో పోలీసులు ఈరోజు ఆ సంస్థకు చెందిన కీలక నేతలను,పలువురు వేర్పాటువాదులను గృహనిర్బందం చేశారు.