కాశ్మీర్‌ హింసను ప్రేరేపిస్తోన్న పాక్‌

ఆందోళన కలిగిస్తోన్న వరుస ఘటనలు
శ్రీనగర్‌,మే10(జ‌నం సాక్షి): కాశ్మీర్‌లోయలో కొనసాగుతున్న విధ్వంసానికి ప్రతి రోజూ ఒకరిద్దరు సైనికులు మరణిస్తున్నారు. ఐసిస్‌ సహా పాకిస్తాన్‌ నుండి పనిచేస్తున్న ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థలు ఎప్పటికప్పుడు తమ వ్యూహాలు, విధానాలు మార్చుకుంటూ కాశ్మీర్‌లో దాడులు కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాద ముష్కరులతో దాడులు చేయిస్తూ, వారిని ఎదుర్కొనేందుకు వెళుతున్న భద్రతాదళాలపై మహిళలు, విద్యార్థులతో రాళ్లదాడులు చేయిస్తున్నారు. కాశ్మీర్‌లోయ ముఖ్యంగా శ్రీనగర్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి రోజూ విధ్వంసం సృష్టించటంలో వీరు విజయం సాధించారు. పాకిస్తాన్‌ ప్రేరిత ఇస్లామిక్‌ ఉగ్రవాదులు కాశ్మీర్‌లోని ఐదు జిల్లాల్లో మారణ¬మం సృష్టిస్తుంటే అక్కడ సామాన్యులకు దినదినగండంగా మారింది. విద్యార్థులు, మహిళలు భద్రతాదళాలతో తలపడే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా విధ్వంసకారులు, రాళ్లు రువ్వుతున్న వారిని అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక మహిళా సిఆర్‌పిఎఫ్‌ దళాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. యువకులు, మహిళలు భద్రతాదళాల సిబ్బందిపై చేయి చేసుకుంటూ అవమానాలకు గురి చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన స్థాయిలో స్పందించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. శ్రీనగర్‌తో పాటు మరో నాలుగు జిల్లాలోనే ఇస్లామిక్‌ తీవ్రవాదం పేట్రేగిపోతోంది. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను ఆనుకుని ఉన్న లోయలోనే ఇస్లామిక్‌ తీవ్రవాదం అదుపులేకుండా కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్‌ రాష్ట్రంలో మొత్తం ఇరవై రెండు జిల్లాలుంటే జమ్ము ప్రాంతంలో పది, కాశ్మీర్‌లోయలో పది, లద్దాక్‌ డివిజన్‌లో రెండు జిల్లాలున్నాయి. జమ్ము, లద్దాక్‌ ప్రాంతాల్లో ఇస్లామిక్‌ తీవ్రవాదం అతి స్వల్పంగా ఉంటే కాశ్మీర్‌లో ఇది అదుపు తప్పే స్థాయికి చేరుకున్నది. కాశ్మీర్‌ లోయలో మొత్తం పది జిల్లాలుంటే- ఐదు జిల్లాల్లో ఇస్లామిక్‌ ఉగ్రవాదం అత్యధికంగా ఉన్నది. పాకిస్తాన్‌ సరిహద్దులను ఆనుకున్న ఈ జిల్లాల్లోకి ఉగ్రవాదులు ఇష్టానుసారం వచ్చి
పోతున్నారని చెప్పకతప్పదు. దాడి జరిగిన ప్రతిసారీ ఇక విూదట భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టంగా ఉంటాయని ¬ంశాఖ ప్రకటించటం ఆనవాయితీగా మారింది.