కిడ్నీ వ్యాది గ్రాస్థులకు వచ్చే రిపోర్ట్ ఆధారంగా చికిత్స అందిస్తాం

-జిల్లా ఉప వైద్యాధికారి సిద్దప్ప

ఇటిక్యాల (జనంసాక్షి) అక్టోబర్ 12 రోగులకు వచ్చే రిపోర్టుల ఆధారంగా చికిత్స అందిస్తామని జిల్లా ఉప వైద్యాధికారి సిద్ధప్ప అన్నారు. మండలంలోని సాతర్ల గ్రామంలో రోజురోజుకి పెరుగుతున్న కిడ్నీ వ్యాధి అనే కథనానికి స్పందించిన అధికారులు. జిల్లాలోని అధికారులతో పాటు మండలంలోని వైద్యాధికారులందరూ కలిసి సాతర్ల గ్రామంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధి బారిన పడిన వారి వివరాలు సేకరిస్తున్నారు. బుధవారం స్థానిక సర్పంచ్ జయచంద్రారెడ్డి తో కలిసి గ్రామంలో పర్యటించారు. అనంతరం డాక్టర్ సిద్ధప్ప మాట్లాడుతూ వార్త పత్రిక లో వచ్చిన శీర్షిక ఆధారం చేసుకుని గ్రామంలో నీటి ద్వారా, లేదా ఏ ఇతర కారణాల చేత వస్తున్నదని గ్రామంలో డాక్టర్ సురేష్ మరియు డాక్టర్ రమ్య ప్రాథమిక ఆరోగ్య బృందంచే రోజు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వారికి వైద్యం అందించడం జరుగుతుందన్నారు.అలాగే 60 సంవత్సరాలు పైన పడిన వారికి రక్త పరీక్షలు బీపీ షుగర్ తో పాటు ల్ ఫ్ టి, ఆర్ ఫ్ టి, సిబిపి, సీ ఆర్ పి… టీ హబ్ ద్వారా పరీక్షలు జరిపిన తర్వాత రిపోర్టులు వచ్చిన అనంతరం వారికి తెలియజేస్తామన్నారు. గ్రామంలో ఉన్న మొత్తానికి టార్గెట్ పాపులేషన్ లో ఉన్న వారందరికీ కూడా రక్తపరీక్షలు నిర్వహిస్తామని మరియు బీపీ షుగర్లు వైద్య పరీక్షలు చేస్తామన్నారు. ఈ మెడికల్ క్యాంపు ఇంకా వారం రోజులు కొనసాగుతుందని డిప్యూటీ డిఎంహెచ్ ఓ తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సబ్ సెంటర్, ఏఎన్ఎంలు, హెల్త్ సూపర్వైజర్ వెంకటేష్, హెల్త్ అసిస్టెంట్ ప్రభాకర్, గ్రామ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.