కీర్తిఆజాద్‌కు లండన్‌ ఎయిర్‌పోర్ట్‌లో అవమానం

లండన్‌ ,జూలై 6 (జనంసాక్షి):

భద్రతా తనిఖీల పేరుతో ఇండియన్‌ సెలబ్రిటీలను విదేశాలలో అవమానించడం పరిపాటిగా మారింది. గతంలో షారూఖ్‌ఖాన్‌ వంటి స్టార్స్‌కు ఇదే పరిస్థితి ఎదురైన విషయం మరిచిపోక ముందే మరో భారత సెలబ్రిటికీ అవమానం జరిగింది. భారత మాజీ క్రికెటర్‌ , పార్లమెంట్‌ సభ్యుడు కీర్తిఆజాద్‌ను లండన్‌లోని హీత్‌రో ఎయిర్‌పోర్టులో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఇంటిపేరు అనుమానాస్పదంగా ఉందంటూ దాదాపు రెండు గంటల పాటు నిర్భందించారు. ఆజాద్‌ వ్యక్తిగత సిబ్బంది ద్వారా ఈ విషయం విూడియాకు తెలిసింది. ఆయనతో పాటు ఉన్న వాటర్‌ బాటిల్‌ అనుమానాస్పదంగా ఉందంటూ సెక్యూరిటీ సిబ్బంది పరిశీలించినట్టు సమాచారం.