కుంభకోణాల నేతలంతా కలసి వస్తున్నారు: కొప్పుల
జగిత్యాల,సెప్టెంబర్15(జనంసాక్షి): 60ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంభకోణాలు, అవినీతిలోనే కాలం గడిపారని ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇప్పుడు మహాకూటమి పేరుతో జట్టు కట్టినా ప్రజలు దగ్గరకు రానీయరని అన్నారు. తెలంగాణ నాలుగేళ్లలోనే దేశానికే ఆదర్శంగా నిలిచిందని, సంక్షేమ పథకాల ఆమలులో రాష్ట్రం ఆగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అవినీతి లేకుండా పాలన సాగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా కోట్ల నిధులు కేటాయించి, ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి వాటిని అమలు చేశారన్నారు. జరుగబోయో ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపుకోసం నియోజకవర్గంలోని గ్రామలతో పాటు పట్టణాల్లో కుల, యువజన సంఘాల వారు శ్రమించాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి వైపు దేశమంతా చూస్తోందని, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజాప్రతినిధుల బృందాలను ఇక్కడి అభివృద్ధిని ఆధ్యయనం చేసేందుకు పంపించడం తెలంగాణ ప్రగతినిదర్శనమన్నారు. పద్నాలుగేళ్ల పోరాట ఫలితంగా సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నరన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నియోజకవర్గంలో కొప్పుల గెలుపున కు అహర్నిశలు కృషి చేస్తామనీ స్థానిక కార్యకర్తుల,నేతలు అన్నారు. ఎమ్మెల్యేగా ఆయన చేసిన అభివృద్ధిని విస్తృంగా ప్రచారం చేస్తామన్నారు.