కుక్కల నియంత్రణ. జంతువుల కుటుంబ నియంత్రణ కోసం యూనిట్ లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

నల్గొండ బ్యూరో. జనం సాక్షి
నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి చందనపల్లి వద్ద గల డంప్ యార్డ్ వద్ద, కుక్కల నియంత్రణ, కొరకు అనిమల్ బర్త్ కంట్రోల్ యూనిట్ ను, చెత్త ద్వారా,వ్యర్థ పదార్థాల ద్వారా ఏర్పాటు చేసే వర్మి కంపోస్ట్ యూనిట్,ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పట్టణంలో వీధి కుక్కల బెడదనానాటికి తీవ్రమైతుందని, వీటివల్ల వాహనాదారులకు, ప్రమాదాలు జగడమే కాకుండా, వీధులలో చిన్న పిల్లలను, పాదచారులను, గాయపరుస్తున్నాయని, వీటిని సంరక్షించి, నియంత్రించవలసి ఉన్నదని ఇందుకోసం నల్గొండ మున్సిపాలిటీ వారు, అనిమల్ బర్త్ కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేయటం, వల్ల వీధి కుక్కల బెడద తగ్గే అవకాశం ఉందన్నారు.
మున్సిపాలిటీ వారు సేకరించే చెత్త వ్యర్ద పదార్థాల నుండి వర్మి కంపోస్ట్ ఎరువుగా తయారు చేయటం, ఆ ఎరువును, మున్సిపాలిటీ వారు వివిధ పార్కుల్లో పెంచుతున్న చెట్లకు, పూల మొక్కలకు,ఎరువు గా ఉపయోగించవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ కెవి రమణాచారి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పేర్ల జానయ్య, బోయినపల్లి శ్రీనివాస్ ఖయ్యూం బేగ్, ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ సమీ, గోగుల శ్రీనివాస్ యాదవ్, పున్న గణేష్, వట్టిపల్లి శ్రీనివాస్, కొండూరు సత్యనారాయణ, పట్టణ పార్టీ అధికార ప్రతినిధి సంధినేని జనార్దన్ రావు,నాయకులు గాదె రామ్ రెడ్డి, కోన జానయ్య, మూడో వార్డు ఇన్చార్జ్ పి జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు