కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం గా ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డికి ఆయన సోదరులు, భార్య కనిపించలేదా
స్వార్ధ ప్రయోజనాల కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారన్నారు.రాజగోపాల్ రెడ్డి రాజీనామా బిజెపికి ఎంతో అవసరమని తెలంగాణ లో రాజకీయంగా విస్తరణ కోసమే బిజెపి రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించిందని విమర్శించారు.మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయం అని అన్నారు.రేవంత్ రెడ్డి అయినా బండి సంజయ్ ల చేతికి రాష్ట్రం వస్తే తెలంగాణ కు నష్టమన్నారు.కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు రాష్ట్రం సుభీక్షంగా ఉంటుంది.
రేవంత్ పై దాసోజ్ శ్రావణ్ వ్యాఖ్యలు వాస్తవికంగా ఉన్నాయి.చాలా రాష్ట్రాలలో తినడానికి సరైన తిండి లేదు
అది వదిలి ఇతర అంశాల మీద మోడీ దృష్టి పెడుతున్నారు
నిత్యవసర ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు
వాటి నుండి దృష్టి మళ్లించేందుకే వివిధ రాష్ట్రాలలో రాజకీయ అనైతిక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు.మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఘనవిజయం సాధిస్తుంది
మునుగోడు ఉప ఎన్నికల్లో నాకు ఆసక్తి లేదు.. సంతృప్తిగా ఉన్నానన్నారు.సీఎం కేసీఆర్ అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.రాజీనామా కారణం ప్రజలకు అంత కన్విన్స్ గా లేదు
తిండి ఎక్కువై రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు.
ఉన్నదాని కంటే ఎక్కువ ఊహించుకోవడం కోమటిరెడ్డి బ్రదర్స్ కు మొదటి నుండి అలవాటని.రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీనియర్ నేతలు ఎవరూ మద్దతివ్వలేదు
నేను, జానారెడ్డి నిలబడి అందర్నీ కన్విన్స్ చేసి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాము.బిజెపి లో రాజగోపాల్ రెడ్డి ఇమడలేరు
మునుగోడు ఉప ఎన్నికల్లో గెలవనని రాజగోపాల్ రెడ్డికి తెలుసు. వామపక్షాల కు 15 వేల ఓట్లు నికరంగా ఉంటాయి
కాంగ్రెస్ ఓట్లను 20 నుండి 30 శాతం మేరకే రాజగోపాల్ రెడ్డి ప్రభావితం చేయగలరన్నారు.