కుటుంబ సభ్యులే చంపారు
-హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరణ
-హత్య వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి
-ఎల్లయ్య హత్య కేసును ఛేదించిన పోలీసులను అభినందించిన ఎస్పి
భూపాలపల్లి టౌన్, జూన్ 25 (జనం సాక్షి):
సొంత తండ్రిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. హత్య కేసును పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చేదించారు. ఈ సందర్భంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హత్య కేసు వివరాలను జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి వెల్లడించారు. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కారల్ మార్క్స్ కాలనీలో స్వంత కుటుంబ సబ్యులే తండ్రిని చంపి ఆత్మహత్య గా త్రీ కరించారు అని తెలిపారు. మృతుడు గొళ్ళెం ఎల్లయ్య కుమారుడు సంతోష్ కుమార్ తన తండ్రి ఎల్లయ్య తన కూతురు రజిత ఇంట్లోనే ఈనెల 20వ తారీఖున నిద్రపోయాడని, నిద్రలోనే చనిపోయి ఉంటాడని, గతంలో తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని, తన తండ్రి మరణం పై ఎలాంటి అనుమానం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని ఎస్పీ తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా ఈనెల 21వ తేదీన కేసు నమోదు చేసి ఇ దర్యాప్తు చేశామని ఆయన పేర్కొన్నారు. మెడికల్ ఆఫీసర్ రిపోర్టు ఆధారంగా ఈ కేసును మర్డర్ కేసుగా మార్చి విచారణ ప్రారంభించామని అన్నారు. విచారణ కొనసాగుతుండాగా మద్యవర్తి ద్వారా పోలీసు స్టేషన్ కు నిందితులు హాజరు కాగా వారిని విచారించగా విచారించడంతో అసలు విషయం తెలిపారఅన్నారు. మృతుడు గొళ్ళెం ఎల్లయ్య సింగరేణి హైస్కూల్ స్కావెంజర్ గా పని చేస్తూ జీవిస్తున్నాడనీ, అతడికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు వారికి వివాహమై ఎవరికి వారే వేర్వేరుగా ఉంటున్నారు, మృతుడు ఎల్లయ్య భార్య భూలక్ష్మి పై అనుమానంతో తాగుడుకు బానిసై ప్రతిరోజు భార్యను తిడుతూ, కొడుతూ అనుమానపడుతూ ఉండేవాడని, ఈ క్రమంలో తేదీన మద్యాహ్నం మృతుడు గోళ్ళెం ఎల్లయ్య మద్యం సేవించి భార్య భూలక్ష్మి నీ అనుమానంతో విపరీతంగా కొట్టగా, మృతుడి భార్య, బాంబుల గడ్డ లోని తన కూతురు రజిత ఇంటికి వెళ్లి గొడవ జరిగిన విషయం కూతురు, కొడుకులకు చెప్పిందన్నారు, కొడుకుల ద్వారా ఎల్లయ్యను కూతురు ఇంటికి పిలిపించి తన ఇద్దరు కొడుకులు తాను కలిసి తన భర్తను చంపాలనే పథకం వేసుకొని తన కూతురు అల్లుడు ఇంట్లో లేని సమయంలో అదే రోజున రాత్రి సమయం 8.30 గంటలకు, ఇదే సరైన సమయం అని భావించి గొళ్ళెం ఎల్లయ్య ను చున్ని తో చేతులు కట్టేసి మెత్తని ముఖానికి అడ్డుపెట్టి ఊపిరాడకుండా చేసి కొడుకులు, భార్య చంపారని తెలిపారు. అనంతరం దీనిని సహజ మరణంగా చిత్రీకరించడానికి పోలీస్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. కేసులో నిందితుల ముగ్గురిపై U/s 302,201 R/W 34 IPC ప్రకారం కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్ తెలిపారు, ఈ కేస్ ను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సిఐ రాజిరెడ్డి, ఎస్ ఐ లు నరేశ్, రామకృష్ణ ,పిసి లు సతీష్, చంద్రశేఖర్ రెడ్డి, మధు లను ఎస్‌పి అభినంధించారు.