కుత్బుల్లాపూర్‌లో భారీ చోరీ
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్‌లోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. తాళం పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు ఇంట్లో చొరబడి రూ.3.25లక్షలు అపహరించారు. మగ్థంనగర్‌కు చెందిన జైపాల్ రెడ్డి నూనె వ్యాపారం చేస్తున్నాడు.
వ్యాపారంలో భాగంగా అతను గురువారం రాత్రి కర్ణాటక వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు ఈ
చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉండటంతో పరిశీలించగా బీరువాలో ఉన్న 9తులాల బంగారం, రూ.50వేల నగదు అపహరణకు గురయినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.