కుమారుడుతో కలిసి భర్తను హతమార్చి భార్య
ఖమ్మం : కుటుంబ కలహాలతో భర్తను హతమార్చిన భార్య, కొడుకుల ఉదంతం ఖమ్మం జిల్లాలో జరిగింది. మధిర పట్టణంలోని ఎస్సీ కాలనీలో కుటుంబ కలహాలతో భర్త ప్రకాష్‌ను భార్య, కొడుకులు కలిసి రోకలిబండతో కొట్టి చంపారు. ఈ సంఘటనతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మధిరలో విషాదాన్ని రేపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.