కులం పేరుతొ పేదలను చీల్చుతున్న దోపిడీ వర్గలు
పెద్దవంగర సెప్టెంబర్ 30(జనం సాక్షి )కులం పేరుతో పేదలను చీల్చుతున్న దోపిడీ వర్గాలు భారతదేశంలో దోపిడి పాలకవర్గాలు పేదలను ఐక్యం కాకుండా కులాల పేరుతో చీల్చుతున్నారని సిపిఐ (ఎంఎల్) తొర్రూర్ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నేడు అఖిలభారత రైతు కూలి సంఘం మండల అధ్యక్షుడు గుగులోత్ పూల్ సింగ్ అధ్యక్షతన కుల నిర్మూలన అవగాహన మీటింగ్ నిర్వహించడం జరిగింది. వృత్తుల ఆధారంగా ఏర్పడిన కులం క్షేమంగా బలపడి విస్తరించి వటవృక్షంగా ఎదిగిందని అన్నారు.తమ దోపిడిని యధాతధంగా కొనసాగించటానికి మన దేశంలోని బూర్జువా పాలకవర్గం పార్టీలు అనేక రహస్యం ఒప్పందాలు కుట్రలతో బిజెపి లాంటి హిందూ మత ముసుగులో మరింత పరితెగించి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జ్యోతిబాపూలే స్థాపించిన సత్యశోధన సమాజం స్ఫూర్తితో దళితులపై దాడులు హత్యలను ఖండిస్తూ నిరంతరం చైతన్యంతో పోరాటం చెయ్యాలని పిలుపునిచ్చారు.కమ్యూనిస్టు ఉద్యమాలు బలపడి ఉద్యమిస్తే మతోన్మాద శక్తులను తరిమి కొట్టొచ్చు అని అన్నారు. సమరశీల పోరాటాల ద్వారా కులన్ని నిర్మూలించాలని అన్నారు. శాస్త్రీయ హేతువాద భావాలను ప్రచారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సెప్టెంబర్ 24 నుండి 30 వరకు గ్రామ గ్రామాన కుల నిర్మూలన అవగాహన ప్రచార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద సబ్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న అన్నారు రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ఓట్ల కోసం కుల రాజకీయాలు చేయటం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.ఈ కార్యక్రమంలో బిక్షం,అబ్బయ్య,శంబయ,కొమరయ్య,వీరస్వామి,వెంకన్న,లక్ష్మి,వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.