కూకట్‌పల్లిలో  ఇదీ పరిస్థితి..

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న కూకట్‌పల్లి నియోజకవర్గంలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. కూటమి అభ్యర్థిగా తెలుగు దేశం పార్టీ తరపున బరిలో దిగిన నందమూరి సుహాసినికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా 200 ఓట్లు వచ్చాయి. అయితే ప్రత్యర్థి పార్టీ అయిన టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 400 ఓట్లు సంపాదించారు. సాధారణ ఓట్లలో కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది.