కూటమి కాదు …అభివృద్ది ముఖ్యం
తెలంగాణ ప్రజల ఓటు కెసిఆర్‌కే: మాజీ ఎమ్మెల్యే
జగిత్యాల,సెప్టెంబర్26(జనంసాక్షి): కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి తదిరత పార్టీలు మహాకూటమిగా ఏర్పడినంత మాత్రన తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మె పరిస్థితుల్లో లేరని మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలకు స్పష్టంగా తెలుసని అన్నారు. అందుకే ఎన్ని పార్టీలు ఒక్కటైన చివరికి మళ్లీ టీ ఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలోని రావడం ఖాయమన్నారు. పార్టీలన్ని ఏకమైనా మళ్లీ రాష్ట్ర ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కడుతారని అన్నారు. టీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి ఆయన గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసరా, మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబం ధు, రైతుబీమాతో పాటు వంటి పథకాలతోపాటు కాళేశ్వరంలాంటి ప్రాజెక్టులను దేశ, విదేశాల ప్రతినిధులు స్వయంగా ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్ర భుత్వాన్ని ప్రశంసిస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పటికే అందరి సహకారంతో కోరుట్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచి రాష్ట్రస్థాయిలో ఓ గుర్తింపు తీసుకొచ్చానని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఓ ఎమ్మెల్యేగా పనిచేయడం తన అదృష్టమని, మరోసారి తనను గెలిపించాలని గ్రామస్తులను కోరారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేసి తనను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా అందించాలని అన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తాను చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకేళ్లాలని కార్యకర్తలకు సూచించారు. టీఆర్‌ఎస్‌కు తనకు
ప్రజల్లో నుంచి ఆపూర్వ స్పందన లభిస్తోందన్నారు. రాబోయే రెండు నెలలు పార్టీ కోసం తన కోసం ఆహర్నిశలు శ్రమించాలన్నారు.
—————–
————————-
—————-
—————-
———————-
——————