కూటమి నేతలను పట్టించుకోవద్దు: రసమయి

కరీంనగర్‌,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  ఎన్నికలు వచ్చాయంటే చాలు ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్‌, బీజేపీ హావిూలతో ప్రజలను మభ్య పెడుతారని, వారి మాటలను నమ్మవద్దని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుత టిఆర్‌ఎస్‌ అభ్యర్థి రసమయి బాలకిషన్‌  అన్నారు. 70 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని నాలుగున్నర ఏళ్లలో టీఆర్‌ఎస్‌ పార్టీ చేసి చూపించిందన్నారు. ఎన్నికల సమయంలో కొంత మంది నాయకులు హావిూల వర్షం కురిపిస్తుంటారని, తాము అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ చెప్పడమే తప్ప చేసి చూపించిన దాఖలాలు లేవన్నారు. /ఖఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మ్యానిఫెస్టోలో ఉన్న అంశాలతో పాటు అందులో లేని కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లాంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఎందరో మంది నిరుపేద కుటుంబాల్లో ఈ పథకాలు ఆడ బిడ్డలకు ఆసర అవుతుందన్నారు. ఈ ఎన్నికల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ అందజేస్తున్న రూ.100116 ను రూ.1,50,000లకు పెంచేందుకు కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారన్నారు. మరోమారు సీఎం కేసీఆర్‌ కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల నుంచి నాయకులు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, నిరుపేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని గుర్తు చేశారు.  దేశంలో ఏ
ప్రభుత్వం చేయలేని విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ఏ ఆసరా లేని ఆడపడుచులకు ఆసరా పింఛన్‌తో సీఎం కేసీఆర్‌ ఆసరా అవుతున్నారన్నారు. వికలాంగులకు రూ.1500, వితంతులకు, బీడీ కార్మికులకు, వృద్ధులకు నెలకు రూ.1000 పింఛన్‌ అందిస్తున్నారన్నారు. మరోసారి కేసీఆర్‌ సీఎంకావాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రజలు దీవించాలన్నారు.