కూడళ్ళను సుందగా తీర్చి దిద్దాలి

గణేష్ నగర్ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలన

* మంత్రి గంగుల, మేయర్ సునీల్

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
నగరంలో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ పనుల్లో వేగం పెంచాలని బీసీ సంక్షేమ పౌరసరఫరల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
శుక్రవారం తెలంగాణ చౌక్ లో కూడళ్ళ సుందరికరణ పనులు ,గణేష్ నగర్ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను నగర మేయర్ సునీల్ రావు తో కలసి మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కూడళ్ళ సుందరికరణ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారువచ్చే ఏడాది మార్చి కల్లా స్మార్ట్ సిటీ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.గణేశ నగర్ బైపాసు రోడ్డు పనులు దసరా వరకు ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ పనులు ఇప్పటికే రెండు ప్యాకేజీలు పూర్తయ్యాయని మూడో ప్యాకేజీ లోని మిగులు పనులన్నీ పురోగతిలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు.నగరంలోని అన్ని జంక్షన్లు అభివృద్ధి చేయాలని,ఇండోనేషియా తరహాలో కళాక్షేత్రం ఆకృతులు ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి -హరిశంకర్ కార్పొరేటర్లు అయిలెందర్ యాదవ్ ,బోనాల శ్రీకాంత్ ,తోట రాములు ,లెక్కల వేణుగోపాల్,నగర కమీషనర్ సేవా ఇస్లావత్ ,ఈ.ఈ కిష్టప్ప ,స్మార్ట్ సిటీ ప్రతినిధులు ఉన్నారు.