*కూలిపోయిన ఇంటి మట్టిని తొలగించిన ఎంపిటిసి

లింగంపేట్ 19 జూలై (జనంసాక్షి)
 లింగంపేట్ మండలంలోని షెట్పల్లి గ్రామంలో మొన్న కురిసిన వర్షాలకు సోమవారం రాత్రి పురాతన ఇల్లు కూలిపోయి పక్కనే ఉన్న సిసి రోడ్డు పై పడడంతో  ప్రయానికులకు ఇబ్బంది.కలగకుండా స్థానిక ఎంపిటిసి రూప్సింగ్ మంగళవారం సిసి రోడ్డు పై పడిన మట్టి ముద్దలను గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో దెగ్గరుండి తొలగించారు.దాంతో గ్రామస్తులు ఆయనను అబినందించారు.