కూలి సంఘం జనరల్ బాడీ సమావేశం
కూలి సంఘం జనరల్ బాడీ సమావేశం కీసర వెంకటయ్య సూరయ్య అధ్యక్షతన వెంకట్రామాపురంలో జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్వేషించి సిపిఎం మండల కార్యదర్శి షేక్ యాకోబు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మూలాన వ్యవసాయ కూలీలకు పనులు లేక వలస పోతున్నారని యాకూబ్ అన్నారు. ఉపాధి హామీ పని వందరోజులు కల్పిస్తామని చెప్పి నామమాత్రంగా కుటుంబానికి ఒక్కరికే కల్పించి చాలీచాలని వేతనాలతో సంవత్సరాల తరబడి బిల్లులు రాక వ్యవసాయ కూలీలు వలసలు పోతున్నారని యాకూబ్ అన్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల దాచేపల్లి తంగేడ రోజుకి వారి కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కూలీల పరిస్థితిని అర్థం చేసుకునే పాలకులు లేరని అన్నారు. వ్యవసాయ కూలీలకి 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని కోరారు.
వలసలు పోయి కూలీలని నివారణ చేయటం కోసం ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదునాతనమైన యంత్రాలు గడ్డి గట్టుడుకు మిషన్ కోతకి యంత్రం నాటుకు యంత్రాలు వచ్చి కూలీలకి పనులు లేకుండా పోయాయని అన్నారు. ఎర్రజెండా అధికారులకు వచ్చిన రోజే అందరి సమస్యలు పరిష్కరించబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో చెవుల స్వాతి, మామిడి నాగలక్ష్మి, ధనమ్మ , సంధ్య, రేణుక, దాయమ్మ , సునీత, సూరయ్య, ఈసారి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.