కృష్ణవేణి హైస్కూల్ లో ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు

రుద్రంగి ఆగస్టు 2 (జనం సాక్షి);
రుద్రంగి మండల కేంద్రంలో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో మంగళవారం జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల లోని విద్యార్థులకు త్రివర్ణ పతక ప్రాముఖ్యత వివరించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ హరినాథ్ రాజు మాట్లాటను… స్వాతంత్ర ఉద్యమకారులను గుర్తు చేసుకోవడం మరిచి పోకుండా ఉండడం అనేది ఎంతో ముఖ్యమని అలాగే భారత దేశమంతా గౌరవించే జాతీయ జెండా రూపకర్త తెలుగు వారు కావడం అనేది చాలా గర్వంచదగిన విషయం అని విద్యార్థిని విద్యార్థులంతా దేశ భక్తి పెంపొమించుకోవాలని అన్నారు.ఈ కార్య్యములో కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్,సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సునీల్ తోపాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గోన్నారు.