*కృష్ణానదిలో మత్స్యకారులకు భారీచేప లభ్యం*

ఇటిక్యాల (జనంసాక్షి) జూలై 30 : ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో మత్స్యకారులకు చేతినిండా పని, పనికితగ్గ ఆదాయం లభిస్తుంది. మండల పరిధిలోని ఆర్ గార్లపాడు గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణానదిలో మత్స్యకారులు శనివారం ఉదయం చేపల వేటకు వెళ్లారు. అందులో మత్స్యకారులు చింతకాయల ఎల్లన్న, శ్రీమతి మాసమ్మ లకు 21కేజీల బరువుగల భారీ చేప వలకు చిక్కుకుంది. అంత బరువు గల చేపను నీటిలో నుండి తీసేటప్పుడు భయపడుతూ తీసిన ఎల్లన్న భారీచేప తనకు దొరకడంతో ఆనందానికి అవధులులేకుండా పోయింది. కృష్ణానదికి భారీగా వరద నీరు వచ్చినప్పుడు ఇలాంటి చేపలు వరదలకు అరుదుగా వస్తుంటాయని అయన తెలిపారు. అనంతరం చేపను వ్యాపారి తిరుమలేష్ కి  విక్రయించి ఆనందం వ్యక్తం చేశారు.