కెజిబివిలో ఉద్యోగాల పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ
జగదేవ్ పూర్, అక్టోబర్ 13 (జనంసాక్షి):
జగదేవ్ పూర్ మండల కేంద్రంలో కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలోని మోడల్ హస్టల్ లో ఖాళీగా ఉన్న స్వీపర్, అసిస్టెంట్ కుక్, స్కావెంజర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఎంఈఓ ఉదయ్ భాస్కర్ రెడ్డి, కెజిబివి ప్రిన్సిపాల్ ఉమారాణి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మోడల్ హస్టల్ లో అసిస్టెంట్ కుక్ ఖాళీగా ఉందని తెలిపారు. దరఖాస్తులు చేసుకునే వారు 7వ తరగతి ఉత్తీర్ణులై, 18 నుంచి 48 వయస్సు కలిగి ఉండి, జగదేవపూర్ వాసులైన మహిళలు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ నెల 17 వరకు కెజిబివిలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.
ReplyForward
|