కెటిఆర్‌తో రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇస్టోనియా రాయబారి రిక్రువ్‌ భేటీ

హైదరాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): తెలంగాణ ఐటి రంగంలో ముందున్నదని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ముందున్నామని మంత్రి కెటిఆర్‌ అన్నారు. రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇస్టోనియా రాయబారి రి¬ క్రువ్‌ క్యాంప్‌ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, టీ బ్రిడ్జ్‌ అంశాల్లో పరస్పర సహకారంపై రి¬క్రువ్‌తో మంత్రి కేటీఆర్‌ చర్చించారు. తెలంగాణ పరిశ్రమల విదానం, ఐటి విస్తరణ తదితర అంశానలు కెటిఆర్‌ ఆయనతో చర్చించారు. మంత్రి లక్ష్మారెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

“>