కెటిఆర్‌ వెంటే ఉంటామన్న నేరెళ్ల బాధితులు

రాజన్న సిరిసిల్ల,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మంత్రి కేటీఆర్‌ వెంటే తామంతా ఉంటామని నేరెళ్ల బాధితులు

పేర్కొన్నారు. వేములవాడలో పసుల ఈశ్వర్‌, బత్తుల మహేష్‌, గంధం గోపాల్‌, చెప్పాల బాలరాజు నలుగురు నేరెళ్ల బాధితులు నేడు విూడియాతో మాట్లాడారు. తమని కొంతమంది రాజకీయంగా వాడుకున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. నేరేళ్ల ఘటనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తప్పేమిలేదన్నారు. నేరేళ్ల ఘటన పోలీసుల అత్యుత్సాహంతో జరిగిందని తమ పోరాటం పోలీసులతోనే కానీ ప్రభుత్వంతో కాదని చెప్పారు. మంత్రి కేటీఆర్‌ వెంటే ఉంటామన్నారు. కేటీఆర్‌ తమకు సహాయం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఇకపై నేరేళ్ల ఘటనపై ఎలాంటి ఆందోళన చేయబోమని పేర్కొన్నారు.