కెప్టెన్‌గా నా ఓటు నాకేనంటున్న ధోని

నాకేనంటున్న ధోని


శ్రీనగర్‌ జూన్‌ 4 : శ్రీనగర్‌కు 55 కిలో మీటర్ల దూరంలో ఉన్న బారాముల్లాలోని సరిహద్దు నియ ంత్రణరేఖ (ఎల్‌ఓసీ)నిసందర్శించి న సందర్భంలో ఈ విషయాన్ని తెలిపాడు. భవిష్యత్‌ నాయకుడు ఎవరనేది సెలక్టర్లు చూసుకుంటారని చెప్పాడు. ఈ వ్యక్తి నా వారసుడంటూ చెప్పడం నాకిష్టం లేదు. అసలది నాకు సంబంధంలేని విషయం. సెలక్టర్లు చూసుకుం  టారు.నా దృష్టిలో మాత్రం కె ప్టెన్‌గా నాకే ఓటు వేసుకుంటానని అన్నాడు. పో టీగా తీసుకుంటే వీరేంద్రసేహ్వాగ్‌ గౌతమ్‌ గంభీర్‌, విరాట్‌కోహ్లీ ఉంటారని అన్నాడు. ఉదంపూర్‌లోని నార్తర్న్‌ కమాండ్‌ హెడ్‌క్వార్టర్స్‌ను ధోని సందర్శించి అక్కడి అధికారులతో పాటు జవాన్లతో సరదగా కాసేపు ముచ్చటించి వారి పిల్లలతో6 ఉల్లాసంగా గడిపాడు. ఇటీవలే గౌరవ లెస్టినెంట్‌ కల్నల్‌ హో దా పొందిన ధోని రెండు రోజుల పాటు సరిహద్దు సైన్యంతో గడిపాడు.నాలుగుసంవత్సరాల తర్వాత కోల్‌కత్తా జట్టును ఇండియాన్‌ ప్రీమిచర్‌ లీగ్‌ (ఐపిఎల్‌)లో ఛాంపీయన్‌గా నిలబెట్టిన కెప్టెన్‌ గౌ తమ్‌గంభీర్‌ ఆతర్వాత టీమిండియాటెస్టు కెప్టెన్‌గా బాధ్యతలను నిర్వహించేందుకు తాను సిధ్దమేనని అనడం గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో జరి గిన టెస్టుల్లో ధోని వైఫల్యం కావడంతో టెస్టు కెప్టెన్‌గా గంభీర్‌ని నియమించే అవకాశాలు ఊపందు కున్నాయి. ప్రస్తుతం టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా ఓపెనర్‌ వీరేంద్రసేహ్వా గ్‌ నాయకత్వం వహిస్తున్నా డు. గతయేడాది జరిగిన వెస్టిండిస్‌ టూర్‌లో గా యం కారణంతో వన్డే సిరీస్‌కు దూర మవ్వడంతో కెప్టెన్సీ బాధ్యతలను సేహ్వాగ్‌ తీసుకున్న విషయం తెలిసిందే.ఆ తర్వాత వైస్‌కెప్టెన్సీ బాధ్యతల ను కొం త కాలం గౌతమ్‌గంభీర్‌ నిర్వహించాడు.ఈ సంవ త్సరం మొదట్లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా క ప్‌కు ముందు వైస్‌కెప్టెన్‌గా ఉన్నగౌతమ్‌గంభీర్‌ను తొలగించి అతనిస్ధానంలో విరాట్‌ కోహ్లీని నియ మించడం జరిగింది.