కెసిఆర్ వరాల జల్లు
పజలకు ఉచితంగా మంచినీటి సరఫరాకు హావిూ
డిసెంబర్ నుంచి బిల్లులు కట్టేది లేదని వెల్లడి
సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా
థియేటర్లకు విద్యుత్ బిల్లుల రద్దు
హైదరాబాద్ అభివృద్దికి ఓటేయాలని కెసిఆర్ పిలుపు
తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రణాళిక విడుదల
హైదరాబాద్,నవంబర్23 (జనంసాక్షి): గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా సిఎం కెసిఆర్ జంట నగరాల ప్రజలపై వరాల జల్లు కురిపించారు. సాధారణ ప్రజలపట్ల కరుణ చూపారు.న వివిధ వర్గాలకు తాయిలాలు ప్రకటిస్తూ పార్టీ ప్రణాళికను విడుదల చేశారు. గొన్న నగరంగా తీర్చిదిద్దున్న క్రమంలో నగర ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అభివృద్దికి ఓటేయాలన్నారు. నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పామని, దానిని కాపడుకుందామని పిలుపునిచ్చారు. ఇకపోతే హావిూలో భాగంగా 20 వేల లీటర్ల లోపు మంచినీటిని వాడుకునే వారికి డిసెంబర్ నెల నుంచి ఉచితంగా తాగునీరు సరఫరా అందించనున్నట్లు ప్రకటించారు. వినియోగదారులు ఒక్క రూపాయి కూడా ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. పేదలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతివారు నివసించే ఈ నగరంలో ప్రజల విూద కొంత భారాన్ని తీసేయాలని యోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కెసిఆర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ సంచలన హావిూలు ప్రకటించారు. ఆయన ఇచ్చిన హావిూలలో ముఖ్యంగా డిసెంబర్ నుంచి నీటి బిల్లు కట్టాల్సిన పని లేదు.ఇక ఉచితంగా తాగునీరు సరఫరా చేస్తామని ఆయన ప్రకటించారు. అలాగే 24 గంటలు నీటి సరఫరా చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా సెలూన్‌లకు ఉచిత విద్యుత్ కూడా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశ్రమలు , షాపులు, ఆరు నెలల మినిమం విద్యుత్ బిల్లులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక 40 వేల సినిమా కార్మికులకు రేషన్ కార్డు ఇస్తున్నామని ఆయన ప్రకటించారు. అలాగే థియేటర్స్ విద్యుత్ చార్జీలు ప్రారంభం అయ్యే దాకా రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. చిన్న సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ వాటా కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి కెసిఆర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… భారతదేశంలోనే ఒక నిజమైన కాస్మోపాలిటన్ నగరంగా గొప్ప చారిత్రకనగరంగా హైదరాబాద్ ప్రసిద్ధిగాంచిందన్నారు. ఈ నగరానికి చరిత్ర, సంస్క్యృతిగల నగరం ఎవరు ఇక్కడి నుంచి వచ్చినా అక్కున చేరుకుందన్నారు. దేశంలోని చాలాచోట్ల కనిపించవుకానీ మనదగ్గర గుజరాతీ గల్లీ, పార్సిగుట్ట, అరబ్‌గల్లీ, బెంగాళీ, కన్నడ, తమిళ సమాజం నుంచి ఇక్కడ వచ్చి మన సంస్కృతిలో లీనమైమయ్యాయి అన్నారు. వారివారి ఆచారాలు, పండుగలు గొప్పగా నిర్వహించుకునే.. ఒక అందమైన పూల బొకేలాంటి నగరం హైదరాబాద్ నగరం అన్నారు. అందర్నీ కడుపులోకి పెట్టుకొని నగరం చూసుకుంటుంద న్నారు. ఈ నగరాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం విశ్వవ్యాప్తంగా తీర్చిదిద్దే ఎజెండాను టీఆర్‌ఎస్ అమలు చేస్తుందన్నారు. ఇందులో చాలావరకు విజయం సాధించామని అన్నారు. ఇంకా అభివృద్ది చెందాల్సి ఉందన్నారు. జంట నగరాల్లో నేడు మంచి నీటి కొట్లాటలు లేవని, గతంలో శివారు ప్రాంతాల్లో నీటి సమస్యలు ఉండేవన్నారు. ఇప్పుడవన్నీ మిషన్ భగీరథతో పుణ్యమాని కనుమరుగయ్యాయన్నారు. నగరంతో పాటు నగర శివారులోని హెచ్‌ఎండీఏ పరిధిలో కూడా పుష్కలంగా మంచినీటి సరఫరా జరుగుతుందన్నారు. ఇది ప్రజలందరి కండ్ల ముందన్నారు. ఇలాంటి నగరాన్ని ఇంకా అపురూపంగా, గొప్పగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇఅద్భుతమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దేశంలో రెండోస్థానంలో ఉన్నామన్నారు. హైదరాబాద్‌కు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని, అవన్నీ కూడా విజయవంతంగా అమలు జరుగుతున్నాయన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దేశంలో రెండోస్థానంలో ఉన్నామన్నారు. హైదరాబాద్‌కు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నామని, అవన్నీ కూడా విజయవంతంగా అమలు జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని, పూర్తిస్థాయి పారదర్శకంగా, అవినీతి రహితంగా పరిశ్రమలు విధానం తీసుకువచ్చామని, ప్రస్తుతం తీసుకువచ్చి నటువంటి ధరణి పోర్టల్ విషయంలో కానీ, అదే విధంగా టీఎస్ బీ-పాస్‌గానీ, టీఎస్ ఐ-పాస్ గానీ ప్రపంచవ్యాప్తంగా ప్రజల, పారిశ్రామిక వేత్తల మన్ననలు పొందుతున్నాయన్నారు. ఇవన్నీ విశ్వవేదికపై పెద్దకీర్తిని హైదరాబాద్‌కు తీసుకువచ్చాయన్నారు. అలాగే ఇన్‌ఫ్రాస్టక్చర్ర్ క్రియేషన్‌లోనూ ముందుకు దూసుకెళ్తున్నామని, నగరాన్నీ మరింత పట్టుదలతో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఇక్కడనున్న అనేక ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన పేద, ధనిక ప్రజలందరినీ సమదృష్టితో చూస్తూ, మంచి విధానంతో, సామరస్యపూర్వక వాతావరణంలో నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రజలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జంటనగరాల భవిష్యత్, భాగ్యం కోసం టీఆర్‌ఎస్ ప్రతిపాదిస్తున్న ఎజెండాను అర్థం చేసుకొని, టీఆర్‌ఎస్‌తో హైదరాబాద్ అభివృద్ధి ప్రయాణంలో చేయిచేయి కలిపి ముందుకు రావాలని, టీఆర్‌ఎస్ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించాలని కోరారు. గతంలో ఇచ్చిన విజయం కంటే ఉన్నతమైన విజయాన్ని చేకూర్చాలని జంటనగరాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్షౌరశాలలు(సెలున్లు)కు ప్రభుత్వం డిసెంబర్ నెల నుంచి ఉచిత విద్యుత్ సరఫరా చేయనుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నాయి బ్రాహ్మణులు చాలా కాలంగా కోరుతున్న ఈ కోరికను రాబోయే డిసెంబర్ నుంచి ప్రభుత్వం నెరవేర్చ నున్నట్లు తెలిపారు. నాయి బ్రాహ్మణుల ఆర్థిక పురోభివృద్ధికి ఈ చర్య తోడ్పడుతుందని సీఎం పేర్కొన్నారు. మన హైదరాబాద్ అందరికంటే ముందు అభివృద్ధిలో ముందు ట్యాగ్‌లైన్‌తో సీఎం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. హైదరాబాద్ నగర సమగ్ర, సుస్థిర అభివృద్ధికి టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిపాదిస్తున్న ఎన్నికల ప్రణాళిక అన్నారు. సుందరమైన, పరిశుభ్రమైన, పచ్చదనంతో కూడిన నగరం దిశగా ప్రయాణానించేందుకు అండదండలివ్వాల్సిందిగా కోరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కె. కేశవరావు, మంత్రులు మమ్మూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తీలసాని, కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.