*కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ అందజేత*
– ముకుందాపురం గ్రామ సర్పంచ్ పందిరి కళావతి నాగిరెడ్డి
మునగాల, ఆగష్టు 11(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం చాలా బాగుందని, మంచి పోషకాల ఆహారమని ముకుందాపురం గ్రామ సర్పంచ్ పందిరి కళావతి నాగిరెడ్డి అన్నారు. ఇటీవల రాష్ట్రంలోని అంగన్‌వాడీల్లో అందిస్తున్న మిల్లెట్ ఫుడ్ ను ఐసిడిఎస్ మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా వికలాంగ కిషోర బాలికలకు న్యూట్రిషన్ కిట్ అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పందిరి కళావతి నాగిరెడ్డి మాట్లాడుతూ, తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని, ప్రతీ అంగన్‌వాడీ కేంద్రంలో న్యూట్రీగార్డెన్ ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. రక్తహీనతతో బాధపడుతున్న యువతులు, మహిళలకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. 15-49 ఏళ్ల వయసుగల యువతులు, మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గుర్తించిందని, దాని నివారణకు తెలంగాణ ప్రభుత్వం ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల’ను సిద్ధం చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముకుందాపురం గ్రామంలో సర్పంచ్ కళావతి, అంగన్వాడీ టీచర్ సంధ్య, సెక్రటరీ రవి, పందిరి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.